పాక్‌లో తాలిబన్లు మరిన్ని దాడులు జరపొచ్చు!

తహరీక్-ఏ-తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశంలో మరిన్ని ఉగ్రవాద దాడులు జరపొచ్చని అమెరికాకు చెందిన ఓ గూఢచార సంస్థ వెల్లడించింది.

పాకిస్థాన్ దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడతారని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ గూఢచార సంస్థ అధికారి స్ట్రైట్‌ఫోర్ తెలిపారు.

ఇదివరకు తాలిబన్ ప్రకటించినట్లు పాకిస్థాన్ దేశంలో వివిధ ప్రాంతాల్లో మరిన్ని దాడులకు పాల్పడుతుందని, ఈ దాడులు తమ సత్తాను చాటుకునేందుకేనని స్ట్రైట్‌ఫోర్ వివరించారు.

తాలిబన్లు ప్రస్తుతం చేస్తున్న దాడుల్లో చాలా మార్పులు చేశారని, సులభతరమైన లక్ష్యాలను ఎంచుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.

గత కొద్ది రోజలుగా పాకిస్థాన్ దేశంలో తాలిబన్లు చేస్తున్న దాడుల్లో ప్రత్యేకత ఉందని, దీనినిబట్టి చూస్తుంటే తాలిబన్ ఉగ్రవాదులకు వివిధ ప్రాంతాల్లో మంచి స్థావరాలున్నాయని, అలాగే వారి వద్ద విలువైన పేలుడు పదార్థాలున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి