పేదరికాన్ని నిర్మూలిస్తే ఉగ్రవాదం అంతం: ఖురేషీ

ప్రపంచంలోనున్న పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయవచ్చని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి ముహమ్మద్ ఖురేషీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పేదరికాన్ని నిర్మూలిస్తే ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయవచ్చని పాక్ విదేశాంగ శాఖామంత్రి ముహమ్మద్ ఖురేషీ నేషనల్ పబ్లిక్ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ దేశంలోనున్న పేదరికాన్ని నిర్మూలిస్తే ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దీనికిగాను తమ దేశంలోని పౌరులకు ఉత్తమమైన శిక్ష, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించడంలో తాము ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. తమ దేశంలోనున్న తాలిబన్లతోపాటు ఇతర ఉగ్రవాద సంస్థలు పేదరికాన్ని ఆసరాగా చేసుకుని లబ్ది పొందుతున్నారని ఆయన అన్నారు. దీంతో పేదవారిని ఉగ్రవాదంవైపు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే వారు సుశిక్షితులైతే ఉగ్రవాదం వైపు తమ దృష్టి పెట్టరని తాము గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా అమెరికా గతంలో ప్రకటించిన విధంగా తమ దేశానికి ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి ఆదుకుంటే తాము అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నిస్తామని, దీంతో దేశంలోని ప్రతి పౌరునికి ఉత్తమమైన విద్య, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు, దీంతో తమ దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి