పాకిస్థాన్‌లో నానాటికీ ఆత్మాహుతి దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం పేషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఆరుగురు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలైనాయి.
పేషావర్ పట్టణంలోని వాయువ్య ప్రాంతంలో శుక్రవారం ఆత్మాహుతి దళానికి సంబంధించిన వ్యక్తి తనను తాను పేల్చుకోవడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రగాయాల పాలైనారు.
శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడి పట్టణంలోని స్వాతి పథక్ ప్రాంతంలోనున్న సిఐఏ భవంతి వద్ద జరిగిందని, ఇది పాకిస్థాన్ ఆర్మీ భద్రతా దళాధికారి కార్యాలయానికి సమీపాన ఉండటం గమనార్హం,
లాహోర్‌లో గురువారం జరిగిన దాడుల నుంచి తేరుకోకముందే మరో దాడి జరగడంతో పోలీసులు, భద్రతా దళాధికారులు అప్రమత్తమై పాక్ వాయువ్య ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.