బంగ్లా పోలీసుల అదుపులో లష్కర్ తీవ్రవాది

లష్కర్-యే-తోయిబాకు చెందిన ప్రముఖ ఉగ్రవాదిని భారత సరిహద్దుల్లోని ఢాకాలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

భారతసరిహద్దులోని గాబ్తలీ ప్రాంతంనుంచి ఢాకావైపు వెళుతున్న ఇమ్దాదుల్లాహ్ అలియాస్ మెహబూబ్ (28)ను బంగ్లాదేశ్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతను లష్కర్-యే-తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి అని పోలీసులు వివరించారు.

పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-యే-తోయిబా గ్రూపు కో-ఆర్డినేటరని, 2006లో బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డాడని, ఇతను బంగ్లాదేశ్ వ్యక్తి కాదని వారు తెలిపారు. సరిహద్దుల్లో ఇతను బాంబుల తయారీ సామగ్రిని చేరవేసే వ్యక్తుల ముఠాలో ఓ సభ్యుడని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు.

గత కొద్ది వారాల్లో పట్టుబడ్డ మిలిటెంట్ ప్రముఖుల్లో ఇతను రెండవ వ్యక్తి అని పోలీసులు పేర్కొన్నారు. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎమ్‌బీ)కు చెందిన శిక్షణా సంస్థలను యాంటీ టెర్రర్ పోలీసులు ధ్వంసం చేసారని, అక్కడున్న తీవ్రవాదులను తాము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి