బ్రెజిల్‌లో పోలీసు హెలికాప్టర్‌పై దాడులు

బ్రెజిల్‌లోని రియోడి జెనేరియోలో ఓ పోలీసు హెలికాపక్టర్‌పై అనుమానితులు దాడులకు పాల్పడి దానిని కూల్చి వేశారు. దీంతోపాటు ఐదు బస్సులు, ఓ పాఠశాలను మట్టుబెట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందడంతోపాటు మరో ముగ్గురు అపరాధులు కూడా చనిపోయినట్లు సమాచారం.

దాడులకు పాల్పడ్డ దుండుగులు తమపై పోలీసులు తీవ్రమైన నిందారోపణలు చేస్తున్నారని, దీనికి ప్రతీకార చర్యగానే తాము ఈ దాడులకు పాల్పడ్డామని వారు తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

పోలీసు హెలికాప్టర్‌పై దాడులకు పాల్పడటంతో పైలట్ హెలికాప్టర్‌ను ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దింపాల్సి వచ్చిందని మిలిటరీ పోలీసు మేజర్ ఓడరలీ సేంటోస్ తెలిపారు.

హెలికాప్టర్‌లో ఆరుగురు పోలీసులు ప్రయాణిస్తున్నారని, వీరు ఝగ్గీ ప్రాంతంలోని దాడులను అదుపచేసేందుకు, అలాగే అక్కడున్న మాదకద్రవ్యాల సరఫరా ముఠాను మట్టుబెట్టేందుకు బయలు దేరారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

హెలికాప్టర్‌ను ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దింపిన వెంటనే పేలుడు సంభవించిందని, ఇందులోనున్న ఆరుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలైనారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

వెబ్దునియా పై చదవండి