భారతీయ విద్యార్థులతో పోటీ పడండి: ఒబామా

విద్యారంగంలో ముందున్న భారత్, చైనా విద్యార్థులతో మనం పోటీపడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపు నిచ్చారు. అమెరికన్ల కంటే భారత్, చైనా విద్యార్థులే విద్యారంగంలో ముందున్నారని ఒబామా తెలియజేశారు.

2020 కల్లా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అమెరికాలో ఎక్కువ మంది గ్రాడ్యుయేటర్లు కలిగి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఒబామా వెల్లడించారు.

వారెన్ మిచిగాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ.. ఇప్పటికే అమెరికన్ల కంటే ముందున్న భారత, చైనా విద్యార్థులను చూసి, అమెరికాలోని తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి