భారతీయులకు గరిష్ట భద్రత కల్పిస్తాం: రూడ్

ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధానమంత్రి కెవిన్ రూడ్ మాట్లాడుతూ.. తమ దేశంలో విదేశీ విద్యార్థులకు గరిష్ట భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఆస్ట్రేలియాలో చదువుతున్న విదేశీయులకు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

భారతీయ విద్యార్థులపై వరుసగా జాతివివక్ష దాడులు జరుగుతుండటంతో, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా బృందంతో ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్ మాట్లాడారు. భారతీయ యువకులపై ఆస్ట్రేలియాలో వరుసగా 16 దాడులు జరగడంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

జాతివివక్ష లేని దేశంగా ఆస్ట్రేలియాకు ఉన్న పేరును తాజా సంఘటనలు ప్రభావితం చేశాయి. విదేశీ విద్యార్థులకు దేశంలో పటిష్ట భద్రత కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులకు సురక్షితమైన ప్రదేశమని రూడ్ ఎన్డీటీవీతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి