మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం జరుపుతున్న ఆంగ్ సాన్ సూకీని విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి మరోసారి డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో సూకీని భాగస్వామిని చేయాలని డిమాండ్ చేశారు. ఆమె లేకుండా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు విశ్వసనీయత సంతరించుకోలేవని పేర్కొన్నారు.
2010 సాధారణ ఎన్నికలకు విశ్వసనీయత రావాలంటే మయన్మార్ మిలిటరీ జుంతా ప్రజాస్వామ్య పోరాటకర్త సూకీని వీటిలో భాగస్వామిని చేయాలని మూన్ కోరారు. మయన్మార్ ఎన్నికలు న్యాయబద్ధంగా, విశ్వసనీయంగా జరగాలంటే సూకీతోపాటు, మిగిలిన రాజకీయ ఖైదీలందరినీ మయన్మార్ మిలిటరీ పాలకులు విడిచిపెట్టాలని బాన్ డిమాండ్ చేశారు.