మసీదులో ఆత్మాహుతి దాడి : 11 మంది మృతి

ఉత్తర ఇరాక్‌లోని ఓ మసీదులో శుక్రవారం నమాజు చేసే సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడికి పాల్పరడ్డాడు. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందగా దాదాపు 42 మంది తీవ్రగాయాలపాలైనారు.

ఇరాక్‌లోని తాల్ అఫర్ పట్టణంలోని ఓ సున్నీమతస్థులకు చెందిన మసీదులో ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయని, దుండుగులు ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

తీవ్రంగా గాయాలపాలైనవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి