మైఖేల్ జాక్సన్ అప్పులు రూ. 2,500 కోట్లు

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్‌ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదంటున్నారు అతని సన్నిహితులు. అతనికి మిలియన్ డాలర్లకొద్ది అప్పులుకూడా ఉన్నాయని అతని సన్నిహితులిచ్చిన సమాచారం.

తన చిన్న తనంలోనే పాప్ సంగీత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన జాక్ తన నలభై సంవత్సరాల పాప్ కెరీర్‌లో లెక్కలేనన్ని అవార్డులను కైవసం చేసుకున్నాడు. జాక్సన్ రూపొందించిన పాప్ ఆల్బమ్‌లు ఆల్‌టైమ్ రికార్డుగా అమ్ముడుపోయాయంటే అతిశయోక్తికాదు.

ఇదిలావుండగా గతంలో ఎవ్వరూ తీసుకోని రెమ్యునరేషన్ జాక్సన్ తీసుకోవడం ఓ విశేషం. కాగా ప్రస్తుతం ఇతనికి దాదాపు 5 వందల మిలియన్ డాలర్ల అప్పులున్నాయని "ది వాల్ స్ట్రీట్ జర్నల్" పత్రిక ఈ నెల ప్రారంభంలోనే ప్రచురించింది.

ఏదేమైనప్పటికి జాక్ రూపొందించిన ఆల్బమ్‌లలో బీట్‌లెస్ సంగీతానికి చెందిన క్యాటలాగ్ ఒకటి. దీని ధర ఒక బిలియన్ డాలర్లకుపైగానే అమ్ముడవుతుందని పాప్ సంగీత ప్రపంచపు నిపుణులు చెపుతున్నారు.

గతంలో జాక్సన్ పిల్లలను లైంగికంగా వేధించాడని విపరీతమైన ఫిర్యాదులు అందడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అతనిని విచారించిన మీదట ఇరవై నుంచి ముప్పై మిలియన్ డాలర్లను జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఇలాకూడా మైక్ తను సంపాదించిన సొమ్ములో కోర్టుకు ఫైన్‌గా చెల్లించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం అతని ఏడాది సంపాదన అని ఆ పత్రిక పేర్కొంది. కాగా అతను ఎంతోమంది అనాధలను ఆదుకున్నాడని, వారికి మంచి భవిష్యత్తుకూడా కల్పించినట్లు అతని మిత్రులు శోకతప్త హృదయాలతో చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి