లిబియా నియంత ముయమ్మార్ గడాఫీపై జరుగుతున్న పోరాటంలో రెబెల్స్ ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్(టీఎన్‌సీ) సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ యూనస్ మరణించినట్లు లిబియా తిరుగుబాటుదారులు గురువారం అర్ధరాత్రి ప్రకటించారు.
అంతర్జాతీయ గుర్తింపును సాధించిన తిరుగుబాటుదార్లు దేశ పశ్చిమ ప్రాంతంలోకి చొచ్చుకొనిపోయిన తర్వాత ఈ ప్రకటన చేశారు. తిరుగుబాటుదారులను గుర్తించిన అనేక దేశాలు మిలియన్ డాలర్ల నిధులను అందిస్తున్నాయి. అనేక సంవత్సరాల పాటు గడాఫీ ప్రభుత్వంలో కీలకంగా వున్న యూనస్ ఫిబ్రవరి నుంచి టీఎన్‌సీ మిలిటరీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
41 సంవత్సరాల గడాఫీ పాలనకు చరమగీతం పాడాలని గత కొన్ని నెలలుగా పోరాడుతున్న లిబియా తిరుగుబాటుదారులు క్రమంగా లిబియాలోని అన్ని ప్రాంతాలపై పట్టు సాధిస్తున్నారు.