వాహనాల రద్దీ నుంచి విద్యుదుత్పత్తి

రోడ్లపై వాహనాల రద్దీ నుంచి విద్యుదుత్పత్తిని చేసేందుకు ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఇనోవాటెక్‌ అనే కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.

ప్రస్తుతం ప్రంపంచంలో విద్యుత్‌ కొరత సమస్య తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించేందుకు ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఓ కంపెనీ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసే ఓ వినూత్నమైన విధానాన్ని కనిపెట్టింది.

రోడ్లపై వాహనాల రద్దీ ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేసే వినూత్న ప్రక్రియ ఆ కంపెనీ రూపొందించింది. వాహనాల ఒత్తిడితో విద్యుదుత్పత్తి చేసే ఈ విధానంలో రోడ్ల ఉపరితలంపై కొంత లోతు వరకు తవ్వి అందులో జనరేటర్లను అమరుస్తారు.

భూమిలోపల అమర్చిన జనరేటర్‌‌లపై నుంచి కార్లు, బస్సులు, ఇతర వాహనాలు వెళ్లినప్పుడు దానిలో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని ఆ కంపెనీ వివరించింది. వాహనాల జనరేటర్‌‌పై నుంచి వెళ్లినప్పుడు కలిగే ఒత్తిడితో కరెంటు పుడుతుంది. ఒక్కో జనరేటర్‌ గంటకు రెండువేల వాట్ల విద్యుత్‌ ఉత్తత్తి చేస్తుంది కంపెనీ పేర్కొంది.

ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రోడ్డు పక్కనే అమర్చిన బ్యాటరీలలో భద్రపరుస్తారు. తాము టెక్నియన్‌ విశ్వవిద్యాలయం సహకారంతో ఈ వినూత్నమైన సాంకేతిక విధానాన్ని అవలంబించనున్నట్లు కంపెనీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి