అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా దీపావళి వేడుకలను వైట్‌హౌస్‌లో ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుని గృహమైన వైట్‌హౌస్‌లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా వెండి దీప ప్రమిదను వెలిగించి దీపావళి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం వేదపండితులైన నారాయణాచారి మంత్రోచ్ఛారణ చేయడాన్ని ఆయన తెదేకంగా చూడటం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచమంతటా దుష్టులు సంహరించబడి శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
దీపావళి పండుగ కారణంగా అమెరికాలోని భారతీయులందరికీ హెల్త్ పాలసీని ప్రకటిస్తూ ఆ ఫైల్‌పై సంతకం చేశారు. తదనంతరం అర్చకులు నారాయణాచారి లక్ష్మీపూజలు నిర్వహించారు. కాగా వైట్‌హౌస్‌లో జరిగే దీపావళి వేడుకలలో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే ప్రథమం.