సింగపూర్ నూతన అధ్యక్షుడిగా టోనీ టాన్ ఎన్నిక

ఆదివారం, 28 ఆగస్టు 2011 (11:30 IST)
మాజీ ప్రధానమంత్రి టోనీ టాన్ ఆదివారం నిర్వహించిన సింగపూర్ అధ్యక్ష ఎన్నిక రీకౌంటింగ్‌లో విజయం సాధించారు. ఈ 71 ఏళ్ల బ్యాంకింగ్ నిపుణుడు తన సమీప ప్రత్యర్ధిపై 7,269 ఓట్ల తేడాతో గెలిచారు. శనివారం జరిగిన ఎన్నికలో నలుగురు అభ్యర్ధులు బరిలో నిలిశారు. 2.1 మిలియన్ల మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

టాన్ పోలైన మొత్తంలో ఓట్లలో 7,44,397 ఓట్లు (35 శాతం) పొందాడు. భారత సంతతికి చెందిన ఎన్ఆర్ నాధన్ స్థానంలో టోనీ టాన్ సింగపూర్ ఏడవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. కాగా లీ హసీన్ ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. పట్టణీకరణ అధికంగా జరిగిన సింగపూర్ వాణిజ్యపరంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచినది.

వెబ్దునియా పై చదవండి