హిరోషిమాను దాటిన జపాన్ అణు రేడియేషన్ లీక్

శనివారం, 27 ఆగస్టు 2011 (15:03 IST)
సునామీ తాకిడికి గురైన అణు కేంద్రం నుంచి విడుదలవుతున్న రేడియోధార్మిక సీసీయం పరిమాణం అమెరికా హిరోషిమా పట్టణంపై వదలిన అణు బాంబు 168 రెట్లకు సమానమని జపాన్ అణు సంస్థ వెల్లడించింది.

పార్లమెంట్ ప్యానెల్ చేసిన విజ్ఞప్తి మేరకు నేడు ఈ అంచనాను విడుదల చేసినట్లు అణు, పారిశ్రామిక భద్రత సంస్థ (ఎన్‌ఐఎస్ఏ) పేర్కొంది. అయితే ప్రమాదవశాత్తూ దీర్ఘకాలికంగా విడుదలయ్యే రేడియేషన్‌కు తక్షణ బాంబు పేలుడుకు పోలిక అసాధ్యమని ఆ సంస్థ తెలిపింది.

ఫుకుషిమా నుంచి విడుదల అయిన రేడియేషన్ 1986లో ఏర్పడ్డ చెర్నోబిల్ విపత్తులో విడుదలైన మొత్తంలో సుమారు ఆరోవంతు ఉంటుందని ఎన్‌ఐఎస్ఏ చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధ ముగింపు కాలంలో అమెరికా లిటిల్ బాయ్ అనే అణు బాంబును జపాన్‌లోని హిరోషిమా పట్టణంపై జారవిడచింది.

వెబ్దునియా పై చదవండి