త్వరలో భారత పర్యటనకు వస్తున్న అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా పాకిస్థాన్ వెళ్లబోరని అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. హిల్లరీ క్లింటన్ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వెళ్లే ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హిల్లరీ క్లింటన్ ఈ నెల 17న భారత్ పర్యటనకు రానున్నారు.
హిల్లరీ క్లింటన్ దక్షిణాసియా పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ కూడా వెళ్లనున్నారు. తాజా దక్షిణాసియా పర్యటనలో ఆమె ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వెళ్లే అవకాశం లేదని, మరోసారి ఈ రెండు దేశాలకు వెళతారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇయాన్ కెల్లీ విలేకరులతో చెప్పారు. భారత్, థాయ్‌లాండ్ దేశాల్లో మాత్రం ఈసారి హిల్లరీ క్లింటన్ పర్యటించనున్నట్లు తెలిపారు.