దిల్ సినిమాతో ఇంటి పేరుగా మార్చుకుని.. దిల్ రాజుగా ఇండస్ట్రీలో మెలుగుతున్న ఆయన కొత్తబంగారులోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు తీసి జనాల్లోకి వెళ్ళిపోయారు. అయితే కమర్షియల్ మాస్ చిత్రాలు తీసినా.. చాలామంది ఇంకా ఆ మూడు సినిమాల గురించే ఆడుతున్నారు. అలాంటి సినిమా ఎప్పుడొస్తుందా..అంటూ విదేశాల్లోకూడా ప్రశ్నిస్తున్నారనీ.త్వరలో నా బేనర్‌లో అలాంటి సినిమా వస్తుందని చెబుతున్నాడు. ఇటీవలే ఆయన చేసిన 'సుప్రీమ్' విడుదలై మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..