ఎన్ని కొత్త టెక్నాలిజీలు వచ్చినా సినిమా ఆగిపోదు - నిర్మాత ఎస్‌కేయెన్

మంగళవారం, 7 జులై 2020 (16:53 IST)
టాక్సీవాలా సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని, ప్రతి రోజు పండగే వంటి మరో బ్లాక్‌బస్టర్ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత ఎస్‌కే యెన్ జులై 7న తన జన్మదినం సందర్బంగా ఈ రోజు సినీ పాత్రికేయులతో ముచ్చటించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో తను నిర్మించిన టాక్సీవాలా బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకోవడమే కాకుండా, టీవీలో టెలికాస్ట్ అయిన ప్రతిసారి మంచి రేటింగ్స్ అందుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
 
టాక్సీవాలా అయిన వెంటనే సుప్రీమ్ హీరో సాయి తేజ్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో బన్నీ వాసు నిర్మించిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ ప్రతిరోజు పండగేకి సహ నిర్మాతగా వ్యవహరించడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇదే ఉత్సహంతో ప్రస్తుతం మారుతీ గారు డైరెక్షన్లో ఓ స్టార్ హీరోతో తెరకెక్కబోతున్న సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా తెలిపారు. అలానే ప్రముఖ ఓటిటికి మారుతీ గారు పర్యవేక్షణలో చేయబోతున్న వెబ్ సిరీస్‌కి నిర్మాతగా ఉండబోతున్నట్లు తెలిపారు ఎస్ కే యెన్.
 
సాయి రాజేష్ డైరెక్టర్‌గా కూడా ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నానని అన్నారు. వీటితో పాటు టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ ప్రస్తుతం చేస్తున్న శామ్ సింగరాయ్ సినిమా పూర్తి అయిన వెంటనే తనతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అన్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్ తదుపరి సినిమాకి కొ-ప్రొడ్యూసర్‌గా ఉండబోతున్నానని, ఈ కరోనా క్రైసిస్ ముగిసిన వెంటనే తాను పని చేస్తున్న ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నాయని అన్నారు.
 
ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీపై ఓటిటిల ప్రభావం ఎక్కువైందనే వాదనకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చిన సినిమా ఇండస్ట్రీకి ఏమీ కాదని అన్నారు. జనాలు థియేటర్స్‌కి వెళ్లడం మానరు అని తెలిపారు. అలానే ప్రస్తుతం థియేటర్స్ మూసి ఉండటం వలన, ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన సినిమాలని జనాలకి చేరే వేసే మాధ్యమంగా ఓటిటిలు నిర్మాతలకు కాస్త ఊరటనివ్వడం వాస్తవం, కానీ ఈ కారణంగా థియేటర్ వ్యూయర్షిప్ తగ్గిపోతుంది అనే వాదనతో నేను ఏకీవభించను అని అన్నారు.
 
సినిమా అనేది ఎవర్‌గ్రీన్, విసిఆర్‌లు, టీవీలు ఇలా టెక్నాలజీలు ఎన్ని వచ్చిన థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటం అనేది ఆడియన్స్ ఆపలేదు. ఈ పంధాలోనే ఓటిటిలు కూడా వచ్చాయి, ఈ మధ్యే శ్రేయాస్ ET ATT కూడా విజయవంతమైంది. ఇవన్నీ విజయవంతమైనా కూడా సినిమాలు ఎవర్‌గ్రీన్. ఎప్పటికి థియేటర్ ఎక్సీపీరియెన్స్‌ని కొట్టేది లేదు ఎందుకంటే మనకి మనసు బాగా లేకపోతే సినిమాకు వెళ్తాము. మనసు బాగున్నా సినిమాకి వెళ్తాం. సినిమా అనేది మన కల్చర్.
 
సినిమా మీద లక్షల మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. అలా థియేటర్స్ కల్చర్ బతికింది భవిష్యత్తులో కూడా బతికే ఉంటుంది. ఎన్ని వచ్చినా థియేటర్ ఫీల్ ఇవ్వలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటం అనేది ఓ ఎమోషన్. అన్ని వర్గాలు వారికి అందుబాటులో ఉండే ఏకైక ఎంటర్టైన్మెంట్, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటమే.
 
ఇక ఈమధ్య మలయాళం సినిమాలు మాదిరిగా తెలుగులో సినిమాలు ఎందుకు రావడం లేదని కొందరు అనడం తనకు బాధ కలిగించినట్లుగా తెలిపారు. మనకి ఏది ఇష్టమో ఇంట్లో ఉండే అమ్మకి లేదా భార్యకి తెలుస్తుంది అనీ, అప్పుడప్పుడు హోటల్లో ఫుడ్ తిన్నంత మాత్రాన అమ్మ చేతి వంటకి వంకలు ఎలా ఐతే పెట్టామో, ఏదొక మలయాళీ సినిమా బాగుంది అని ఆ సినిమాలను మన తెలుగు సినిమాలతో పోల్చి చూడటం సరికాదన్నారు.
 
మన మేకర్స్ మనకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో చూసి మన అభిరుచికి అనుగుణంగా సినిమాలు రూపొందిస్తారు. దేశమంతా మన వైపు చూసిన రీతిన అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగులో సినిమాలు రూపొందుతున్నాయి. బాహుబలి, అల వైకుంపురంలో వంటి హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న సినిమాలు తెలుగులో నిర్మించినవే అనే విషయం మర్చిపోకూడదు. అలానే తన స్నేహితులు నిర్మాత బన్నీ వాసు దగ్గర నుంచి సినిమా, కథలు జడ్జిమెంట్‌ని, దర్సకుడు మారుతీ దగ్గర నుంచి పాత్రలు, ఆడియన్స్ పల్స్ తదితర అంశాలు నేర్చుకుంటా అని తెలిపారు.
 
కరోనా నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావాలని, వీలైనంత వరకు, ఇంటికే పరిమితమవ్వడం అన్ని విధాలుగా మంచిదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ విపత్తు నుంచి బయట పడే మార్గాన్ని చూపించాలని ఆ దేవుడు ని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు ఎస్ కే యెన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు