రెండు జట్లు ఆడిన తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి మంచి ఉత్సాహంగా ఉన్నాయి. పంజాబ్ జట్టులో క్రిస్‌గేల్.. కోల్‌కతా టీమ్‌లో ఆండ్రీ రసెల్ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. శనివారం మ్యాచ్‌లో వీరిద్దరూ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈడెన్‌లో సుడిగేల్ తన మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.