కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అగ్నికీలల్లో పూర్తిగా కాలిపోయిన బస్సును శుక్రవారం భారీ క్రేన్ సాయంతో తొలగిస్తుండగా ఆ క్రేన్ కాస్తా బోల్తాపడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
ఈ వివరాలను పరిశీలిస్తే చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అగ్నికి దగ్ధమైన విషయంతెల్సిందే. ఈ బస్సును రోడ్డు పక్కకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బస్సును క్రేన్ సాయంతో లాగుతున్నారు.
ఆ సమయంలో బస్సు బరువు కారణంగా క్రేన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు ఒరిగిపోయి బోల్తాపడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో క్రేన్ సాయంత్రం ఆ బస్సును రోడ్డు పక్కకు నెట్టారు.
కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనా స్థలిలో బస్సును తొలగిస్తున్న అధికారులు