ఐపీఎల్ 2020 : శివాలెత్తిన డివిలియర్స్ - దూబె .. ఆర్సీబీ భారీ స్కోరు

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (21:31 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, సోమవారం దుబాయ్ వేదికగా ఆర్సీబీ (రాయల్ ఛాలెంజ్స్ బెంగుళూరు), ముంబై ఇండియన్స్ జట్ల పదో లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ టాప్ ఆర్డర్ వీరవిహారం చేసింది. ఒక్క కెప్టెన్ కోహ్లీ (3) తప్ప మిగతా అందరూ ముంబై బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 3 వికెట్లకు 201 పరుగులు చేసింది.
 
ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 54 (5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులతో శుభారంభం అందించగా, వన్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
 
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ భారీ షాట్లతో అలరించాడు. ఈ క‍్రమంలోనే 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన ఏబీ తన దూకుడును చివరి వరకూ కొనసాగించాడు. బుమ్రా, బౌల్ట్‌ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో దూబే(27 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 202 పరుగుల స్కోరును సాధించింది. 
 
టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. దీంతో ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవదూత్‌ పడిక్కల్‌(54; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అతనికి జతగా పడిక్కల్‌ కూడా ఆకట్టుకున్నాడు. 
 
కాగా, బౌల్ట్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫించ్‌ ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి కోహ్లి ఔటయ్యాడు. దాంతో ఆర్సీబీ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పడిక్కల్‌కు డివిలియర్స్‌ జత కలవడంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 
 
వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత డివీ-దూబేలు బౌండరీల మోత మోగించారు. ప్రధానంగా చివరి ఓవర్‌లో దూబే మూడు సిక్స్‌లు కొట్టడంతో ఆర్సీబీ స్కోరు 200 మార్కును దాటింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించగా, రాహుల్‌ చహర్‌కు వికెట్‌ తీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు