ఇందులో సీఎస్‌కేపై 939 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ 933 పరుగులు, కేకేఆర్ 735 పరుగులు, ముంబై ఇండియన్స్ 728 పరుగులు, ఆస్ట్రేలియా 718 పరుగులు సాధించాడు.
ఇక మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్), పడిక్కల్(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించినప్పటికి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలం కావడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా కోహ్లి, పడిక్కల్ మధ్య 111 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడం విశేషం.