పంజాబ్ కింగ్స్ ఖాతాలో గెలుపు.. పిచ్‌పై రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్.. అయినా..?

శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:29 IST)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (63) నిన్నటి మ్యాచ్లో బౌలింగ్ పిచ్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ -2021 యొక్క 17 వ మ్యాచ్‌లో 52 బంతులను ఎదుర్కొన్న అతను 5 ఫోర్లు, 2 సిక్సర్లు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో శిఖర్ ధావన్‌ ని క్రాస్ చేశాడు. ఇది మాత్రమే కాదు, ఐపిఎల్‌లో రోహిత్ 40 వ హాఫ్ సెంచరీ కూడా చేశాడు.
 
డిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ 180 మ్యాచ్‌ల్లో 35.01 సగటుతో 5428 పరుగులు నమోదు చేయగా, రోహిత్ పేరు ఇప్పుడు 205 మ్యాచ్‌ల్లో 5431 పరుగులు చేశాడు. అతను అత్యధిక పరుగుల జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (6021) ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన సురేష్ రైనా (5448) రెండో స్థానంలో ఉన్నారు.
 
రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఐపిఎల్ కెరీర్‌లో 40 వ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో రోహిత్ విరాట్ కోహ్లీతో సమానంగా40 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక హాఫ్ సెంచరీల జాబితాలో కోహ్లీతో కలిసి అతను మూడవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్తానంలో డేవిడ్ వార్నర్ 49 హాఫ్ సెంచరీలు కాగా, శిఖర్ ధావన్‌కు 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
 
కాగా ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకి మళ్లీ గెలుపు రుచి చూసింది. ముంబయి ఇండియన్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60 నాటౌట్: 52 బంతుల్లో 3x4, 3x6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు