రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీమ్ కోచ్ మారడంతో పాటు కొత్తగా ముగ్గురు ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా, పేసర్ దుష్మంత చమీరా, ఆస్ట్రేలియా ప్లేయర్ టీమ్ డేవిడ్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్‌లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ మార్పుల విషయాన్ని ఆర్‌సీబీ టీమ్ శనివారం అధికారికంగా ప్రకటించింది.