ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా నాలుగో ఓటములు చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. వరుసగా ఆధిపత్య ప్రదర్శనలు ఇస్తున్న పంజాబ్ కింగ్స్ ఈసారి టైటిల్ గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో, వారి ఏకైక ఓటమి రాజస్థాన్ రాయల్స్‌తో మాత్రమే జరిగింది.
అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. శ్రేయాస్ అయ్యర్ టీమ్ అద్భుతంగా రాణించడంతో 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమవడంతో ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచు ఛేదనలో గెలుపు కోసం గట్టిగానే పోరాడినప్పటికీ 201/5తో సరిపెట్టుకుంది సీఎస్కే. ఈ మ్యాచ్ 17వ ఓవర్‌లో శశాంక్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్లాగ్ స్పీడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బంతి టాప్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. అప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన రచిన్ రవీంద్ర క్యాచ్ డ్రాప్ చేశాడు. అప్పుడు ఓవర్‌త్రో కారణంగా పంజాబ్‌కు మరో అదనపు పరుగు దక్కింది.
ఇదంతా స్టాండ్స్‌లో నుంచి చూస్తున్న పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా.. ఫుల్ జోష్‌తో ఎగిరి గంతేసింది. స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ సెలబ్రేషన్స్ చేసుకుంది. అదే సమయంలో చెన్నై స్టార్ ప్లేయర్ ధోనీ అసహనంతో కనిపించాడు. ఇంకా హీరోయిన్ వైపు చూస్తుండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.