ఈ "రన్ మెషిన్" ఇప్పటివరకు 265 మ్యాచ్‌లు ఆడాడు, ఈ మ్యాచ్‌లలో అతను 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదాడు - మొత్తం 998 బౌండరీలు. మరో రెండు బౌండరీలు బాదితే కోహ్లీ వెయ్యి మైలురాయిని చేరుకుంటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగే గురువారం మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.
ఐపీఎల్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత శిఖర్ ధావన్ 920 బౌండరీలతో, డేవిడ్ వార్నర్ 899, రోహిత్ శర్మ 885, క్రిస్ గేల్ 761 బౌండరీలతో ఉన్నారు.
మరోవైపు, ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో, అతను 54.66 సగటుతో, 143.85 స్ట్రైక్ రేట్‌తో 164 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.