నేటి నుంచి పవిత్ర రంజాన్ మాస దీక్షలు ప్రారంభం...

ఠాగూర్

ఆదివారం, 2 మార్చి 2025 (10:40 IST)
పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు చేయనున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వివిధ రాజకీయా పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తదితరులు ట్విట్టర్ వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 
 
నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్టు మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ భక్తి శ్రద్ధలతో చేపట్టే ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి సహనం, దానగుణంతో కఠోర ఉపవాసదీక్షలు సాగాలన దేవుడుని ప్రార్థిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు