ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారికి షాపింగ్ న్యూస్.. ఏంటది?

ఆదివారం, 30 డిశెంబరు 2018 (11:02 IST)
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారికి షాపింగ్ న్యూస్. ఆన్‌లైన్‌ కామర్స్ సైట్లు ఫ్లిఫ్‌కార్ట్, అమేజాన్‌లతో ఇక డిస్కౌంట్లు వుండవు. ఇందుకు కొత్త పాలసీనే కారణం. ఇండియన్ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో అమేజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు తమ బిజినెస్ మోడల్‌ను మార్చుకోనున్నాయి. 
 
ఇందులో భాగంగా త్వరలో అమలయ్యే విధివిధానాల కారణంగా డిస్కౌంట్లు వుండవని తెలిసింది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. త్వరలోనే ఈ డిస్కౌంట్స్ విషయం కఠినతరమైన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం మనం చూసినట్లైతే.. చాలావరకు బ్రాండ్స్ తమ మొత్తం ప్రొడక్ట్స్‌ను కేవలం ఈ-కామర్స్ పోర్టల్స్‌లో మాత్రమే విక్రయిస్తున్నాయి. 
 
త్వరలోనే ఈ పని ప్రారంభం కానుంది. తాజా విధి విధానాలతో ఏదైనా బ్రాండ్ ఒక మార్కెట్ ప్లేస్‌లో కేవలం 25శాతం కంటే ఎక్కువ ప్రొడక్ట్స్‌ను విక్రయించేందుకు ఆస్కారం ఉండదట. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీకి సంబంధించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2019 నుంచి అమల్లోకి రాబోతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు