ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ నూతన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇది వాట్సాప్‌కు పోటీగా రానుంది. ఈ యాప్‌ను Anytime పేరిట విడుదల చేయనుంది. ఇందులో ఫీచర్లు పరిశీలిస్తే.. వాట్సాప్ కంటే మరిన్ని ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏనీటైమ్ మెసేజింగ్ యాప్‌తో వాట్సాప్ తీవ్రమైన పోటీ ఎదురవుతుందన్న భావన ఇప్పటినుంచే వ్యక్తమవుతోంది.
ఈ కొత్త ఎనీటైమ్ యాప్‌లో వాట్సాప్‌లోలాగే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్, ఫొటోలు, వీడియోల షేరింగ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కేవలం ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఫీచర్లే కాదు, ఇతర సేవలను ఉపయోగించుకోవచ్చు.
అవసరం అనుకుంటే చాటింగ్ యాప్ నుంచే ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చు. ఆర్డర్లు ఇవ్వవచ్చు. టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని తెలిసింది. ప్రస్తుతం అమెజాన్ ఈ యాప్‌ను అంతర్గతంగా టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
అంతేకాకుండా, అమెజాన్ సంస్థ 'అమెజాన్ స్పార్క్' పేరుతో ఓ సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. షాపింగ్ ప్రాధాన్యంగా రూపొందించిన ఈ సోషల్ నెట్‌వర్క్ ఇంతకుముందే అందుబాటులో ఉన్న పిన్‌ట్రెస్ట్, ఇన్‌స్టాగ్రాంల తరహాలోనే ఉండటంతో నెటిజన్ల మెచ్చుకోలు పెద్దగా పొందడం లేదు.
ప్రస్తుతం ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చిన ఈ సోషల్ నెట్‌వర్క్ యాప్‌ను ఉపయోగించాలంటే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉండాలి. తమ షాపింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆసక్తులు, రివ్యూలు పోస్ట్ చేసుకునే సౌకర్యం ఈ యాప్‌లో ఉంది. అలాగే వినియోగదారులకు, అమ్మేవారికి వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని అమెజాన్ ప్రతినిధి బాబ్ హెతూ తెలిపారు.