డ్యూయల్‌ సిమ్‌లో ఆపిల్‌ ఐఫోన్... పేటెంట్ హక్కులు సొంతం?

ఆదివారం, 18 డిశెంబరు 2016 (17:04 IST)
ప్రపంచంలో ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు పొందిన సంస్థ ఆపిల్. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. మొన్నటికి మొన్న ఆపిల్‌ ఐఫోన్‌‌ను కొనుగోలు చేసేందుకు కొందరు కిడ్నీలు కూడా అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయి. 
 
తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆపిల్‌ డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందట. ఈ మేరకు డ్యూయల్‌ సిమ్‌కు సంబంధించిన పేటెంట్‌ హక్కులను ఆపిల్‌ ఈ మధ్యే పొందిందని సమాచారం. ఇదే నిజమైతే ఆపిల్‌ ఫోన్‌ అంటే చెవి కోసుకునే వారికి బంపర్‌ ఆఫరే.
 
భారత్‌, చైనాల్లో అత్యధిక సంఖ్యలో డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఫోన్‌-8లో డ్యూయల్‌ సిమ్‌ను ఆపిల్‌ పరిచయం చేయనుందట. డ్యూయల్‌ సిమ్‌ టెక్నాలజీకి సంబంధించి ఆపిల్‌ ఇటీవలే అమెరికాలో పేటెంట్‌ హక్కులను పొందినట్టు సమాచారం. అయితే, దీనిపై ఆ సంస్థ ఓ అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి