యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్స్ మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఐఫోన్ 8, 8+, ఐఫోన్ ఎక్స్ (దీన్ని ఐఫోన్ 10గా వ్యవహరిస్తున్నారు). ఐఫోన్ 8 మోడళ్లు రెండూ సిల్వర్, స్పేస్ గ్రే రంగులతోపాటు.. కొత్తగా బంగారవు వర్ణంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లలోని ఫీచర్లను పరిశీలిస్తే..
ఐఫోన్ 8ను 4.7 అంగుళాల టచ్ స్క్రీన్, వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా, 1080పి హెచ్‌డీ నాణ్యతతో స్లోమోషన్ వీడియోలను, 4కే వీడియోలను దీంతో తీయవచ్చు. వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయం ఉంది.
అలాగే, ఐఫోన్ 8+ను 5.5 అంగుళాల టచ్ స్క్రీన్, వైడ్‌యాంగిల్ లెన్స్, టెలిఫొటో లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా దీని ప్రత్యేకతలు. ఈ రెండు మోడళ్లూ 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరలను వరుసగా రూ.45 వేలు, రూ.51 వేలుగా నిర్ణయించారు. భారత్‌లో మాత్రం ఈ ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇక ఐఫోన్ ఎక్స్‌ను ఐఫోన్ టెన్‌గా పిలుస్తున్నారు. యాపిల్ ఇప్పటిదాకా విడుదల చేసినవాటన్నిటిలోకీ మెరుగైనది. 5.8 అంగుళాల సూపర్ రెటీనా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే తెర, డస్ట్, వాటర్ రెసిస్టెంట్ దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ తెర పైనుంచి కింద దాకా, ఆ పక్క నుంచి ఈ పక్క దాకా మొత్తం (ఫుల్ స్క్రీన్) డిస్‌ప్లే ఉంటుంది. గత మోడళ్లలో లేని ప్రత్యేకత ఇది.