Whats App యాప్ కి పోటీగా జోహో తీసుకువచ్చిన Arattai App యాప్ డౌన్లోడ్లతో దూసుకుని వెళుతోంది. ఇప్పటివరకూ కోటికి పైగా డౌన్లోడ్లు జరిగినట్లు తెలుస్తోంది. గూగుల్ ప్లేస్టోర్లో ఫ్రీ యాప్స్ జాబితాలో ఏకంగా 4.8 శాతం రేటింగుతో అగ్రస్థానంలో వుండటం ఆసక్తికరంగా మారింది. ఈ యాప్ దెబ్బకి వాట్స్ యాప్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం వుందని అంటున్నారు.
ఈ అరట్టై యాప్ తమిళం పేరు. తమిళంలో దీనికి అర్థం ఏమిటంటే.. పిచ్చాపాటి మాట్లాడుకోవడం. అరట్టై యాప్ ద్వారా సందేశాలు, వాయిస్, వీడియో కాల్స్, మీటింగులు, స్టోరీలు, ఫోటోలు, డాక్యుమెంట్స్ షేరింగ్ చేసుకునే అవకాశం వుంది. ఇంటర్నెట్ నెమ్మదిగా వున్నా కూడా ఇది పనిచేస్తుంది. మొత్తమ్మీద స్వదేశీ యాప్ అరట్టైకి అంచనాకు మించిన ఆదరణ లభిస్తుండటంతో యాజమాన్యం సంతోషంగా వుంది.