మీరు మీ ఏటీఎం కార్డ్‌ని మీ భార్యకో, భర్తకో లేకపోతే ఇంట్లో మరెవరికైనా ఇస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడబోతున్నారు. ఏ సమస్య రానంతవరకూ మీకు ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు... కానీ... సదరు ఏటిఎం లావాదేవీలో ఏదైనా తేడా వస్తే మాత్రం మీరు కంప్లైంట్ చేసే హక్కుని కోల్పోతారు. షాకయ్యారా...? అంటే ఉదాహరణకు మీ ఏటీఎం కార్డును మీ భార్యో, భర్తో లేకపోతే మీ పిల్లలో తీసుకొని, ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్లారని అనుకుందాం. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినప్పుడు మెషీన్‌లోంచి డబ్బులు వచ్చేస్తే ఓకే... ఒకవేళ డబ్బు రాకుండా మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే మాత్రం మీరు నష్టపోయినట్లే... అవును... భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం దీనిపై కంప్లైంట్ చేసే హక్కుని మీరు కోల్పోయినట్లేనన్న మాట.
సదరు నిబంధనల ప్రకారం... ఎవరి డెబిట్ కార్డ్‌ని వాళ్లే ఉపయోగించాలి. ఎందుకంటే ఏటీఎం కార్డ్ ట్రాన్స్‌ఫరబుల్ కాదు. కాబట్టి దానిని మీరు ఎవరికీ ఇవ్వకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ప్రతీ బ్యాంకులోని నియమనిబంధనలు ఈ విధంగానే చెప్తున్నాయి. మీ ఏటీఎం కార్డుని మీరు ఉపయోగించినప్పుడు లావాదేవీల్లో ఏవైనా సమస్యలు వస్తే మీరు కంప్లైంట్ చేయవచ్చు. అదే మీ కార్డు ఇతరులు ఎవరైనా ఉపయోగించినప్పుడు లావాదేవీల్లో తేడా వస్తే మాత్రం కంప్లైంట్ చేసే హక్కు మీకు లేనట్లే లెక్క. ఏటిఎం కార్డుల విషయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ విధంగా ఉంటాయి
మీ డెబిట్ కార్డ్‌ని మీరు మాత్రమే వాడాలి. ఇతరులకు ఇవ్వకూడదు.
మీ కుటుంబ సభ్యులకు కూడా మీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పకూడదు.