దేశీయంగా ఈ కంపెనీ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీతో పాటు.. ధరలు, ఆఫర్ల యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వివిధ రకాల ఆఫర్లతో రిలయన్స్ జియో ఇతర టెలికాం కంపెనీలను బెంబేలెత్తిస్తోంది.
జియో మ్యూజిక్ యాప్‌లో ఈ ఆప్షన్ ఉంటుందని వెల్లడించింది. వాస్తవానికైతే ఈ కాలర్ ట్యూన్స్‌కు నెలవారీ ఛార్జీలను టెలికాం సంస్థలు వసూలు చేస్తున్నాయి. కానీ, జియో ఈ కాలర్ ట్యూన్స్‌ను నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది.