భారత మార్కెట్లో తమ సంస్థ తొలిసారిగా లైవ్ 5జీ స్పీడ్‌ను చూపించిందని తెలిపింది. భారత మార్కెట్లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటాను నమోదు చేయడమే తమ లక్ష్యమని ఎరిక్ సన్, మార్కెట్ ఏరియా హెడ్ నుంజియో మిర్టిల్లో వ్యాఖ్యానించారు. భారత్‌లో మరో రెండేళ్లలో 5జీ సేవలను తాము ప్రారంభించనున్నామని తెలిపారు.
ఇండియాలో గిగాబిట్ ఎల్టీఈ విస్తరణ కోసం తాము వేచి చూస్తున్నామని తెలిపారు. 5జీ తరంగాలు అందుబాటులోకి వస్తే, ఇప్పుడున్న టెలికం ఆదాయం 43 శాతం మేరకు పెరుగుతుందని ఎరిక్ సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ వెల్లడించారు.