టెక్నాలజీ రంగంలో ముందున్న గూగుల్ ఉద్యోగాలపై కోతలు విధిస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు బారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో గూగుల్ ఉద్యోగాలపై కోత విధించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెయిల్ ద్వారా తెలియజేశారు. దీంతో రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్ కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ కోతలు వుండనున్నాయి. అమెరికాలోని సిబ్బంది ఈ ప్రభావం అధికంగా వుంటుందని ఆల్ఫాబెట్ తెలిపింది.