యూజర్ల డేటా చోరీ - పదుల సంఖ్యలో యాప్స్‌పై వేటు

ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (11:44 IST)
వివిధ రకాలైన ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా యూజర్ల ఫోన్లలోకి చొరబడిన కొన్ని మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్) యూజర్ల డేటాను చోరీ చేస్తున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించిన గూగుల్ పదుల సంఖ్యలో యాప్స్‌పై నిషేధం విధించింది.
 
యూజర్ల ఫోన్ నుంచి ఫోన్ నంబర్లు, ఇతర కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్న డజల్ల కొద్ది సంఖ్యలో యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిషేధించి, వీటిని ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు పేర్కొంది. 
 
ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్‌లలో ముస్లిం ప్రేయర్ యాప్‌లు కూడా ఉన్నాయి. అలాగే, బార్ కోడ్ యాప్, హైవే స్పీడ్ ట్రాప్ డిటెక్షన్ యాప్, క్యూఆర్ కోడ్ స్కానిక్ యాప్‌లు కూడా ఉన్నాయి. లొకేషన్ సమాచారం, ఈ మెయిల్, ఫోన్ నంబర్లు, సమీపంలోని డివైజ్ల పాస్‌వర్డ్‌లను నిషేధిత యాప్‌లు చోరీ ప్రయత్నం చేసినట్టు గూగుల్ యాప్ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు