అలాగే గూగుల్ పే నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకుగాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ పే వినియోగదారులు ఇప్పటివరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్‌ను ఉపయోగించే వారు. అలాగే, ఎలాంటి రుసుంను కూడా గూగుల్ వసూలు చేసేది కాదు. కానీ వచ్చే యేడాది నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి.
'2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్‌ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది.