ఆస్ట్రేలియా కార్చిచ్చు.. అప్పుడేమో బుష్‌ఫైర్.. ఇప్పుడు పబ్ జీ ఆడితే?

ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (15:42 IST)
ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో కార్చిచ్చు సంఘటనతో ఎన్నో మూగజీవులు బలైన సంగతి తెలిసిందే. అలాగే ఎంతో విలువైన అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఎంతో ఆస్తి నష్టం సంభవించింది.

ఆ నష్టాన్ని కొంత వరకు పూడ్చేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ప్రముఖ గేమింగ్‌ సంస్థ పబ్‌జి కార్ప్‌ ముందుకు వచ్చింది. ఇక బెతెస్ధ, యుబిసాఫ్ట్‌ వంటి పలు గేమింగ్‌ కంపెనీలు కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చు నష్టాన్ని పూడ్చేందుకు సహాయం చేయడానికి ముందుకు రానున్నాయి. 
 
తాజాగా పబ్‌జి మొబైల్‌ గేమ్‌లో అందుబాటులో ఉన్న ఆస్ట్రేలియా ఫైర్‌ రిలీఫ్‌ పాన్‌ స్కిన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఆ కొనుగోళ్లు ద్వారా వచ్చిన మొత్తాన్ని పబ్‌జి కార్ప్‌ ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు అందజేయనుంది. అలాగే కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ఆ గేమ్‌ను ఆడడం వల్ల కూడా యూజర్లు సదరు బాధితులకు సహాయం చేయవచ్చు. 
 
ఇప్పటికే ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించనున్న ''బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌" అనే చారిటీ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల్లో ఓ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహరిస్తే.. మరో టీమ్‌లో టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఆడాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు