గూగూల్ ఉచిత ఫోటో స్టోరేజీ ఉండదు.. జూన్ ఒకటి నుంచి...

మంగళవారం, 25 మే 2021 (13:35 IST)
ఏదైనా ఫోటో కావాలంటే ఠక్కున గుర్తుకువచ్చేది గూగూల్ ఫోటో ప్రపంచం. ఇందులో మనకు లభించని ఫోటో అంటూ ఉండదు. అవన్నీ కూడా ఉచితంగానే ఇంతకాలం వాడుతూ వచ్చాం. అలాగే, మన ఫోటోలను కూడా గూగుల్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చాం. కానీ, ఇక నుంచి ఆ అవకాశం ఉండదు. గూగుల్‌ ఫోటోస్‌లకు అన్‌లిమిటెడ్‌ స్టోరేజీ ఇక ఉండదు. 
 
2021 జూన్‌ 1 నుంచి అన్‌లిమిటెడ్‌ స్టోరేజీ ఉండదని గూగుల్‌ గతంలోనే ప్రకటించింది. అంటే గడువు ముగిసే సమయం దగ్గరకు వచ్చేసింది. 2021 జూన్ 1 నుంచి యూజర్ అప్‌లోడ్ చేసే ఫోటోలన్నీ గూగుల్ ఉచితంగా ఇచ్చే 15 జీబీ అకౌంట్‌లోకి వెళ్తాయి. అయితే, ఇప్పటికే అప్‌లోడ్ చేసిన ఫోటోలకు ఈ నియమం వర్తించదు. 
 
అంటే మే 31 వరకు ఎన్ని ఫోటోలు అప్‌లోడ్ చేసినా అన్‌లిమిడెట్ కోటాలోకే వెళ్తుంది. జూన్ 1 నుంచి 15 జీబీ వరకే ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లో ఇప్పటికే ఎక్కువ ఫైల్స్ ఉన్నట్లయితే ఎక్కువ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయలేరు.
 
ఇక ఎక్కువగా స్టోరేజీ కావాలనుకునే వారికి కూడా ఓ పరిష్కారం ఉంది. ఇందుకోసం మీరు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అదనంగా స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ వన్‌లో మూడు రకాల ప్లాన్స్ ఉన్నాయి. 
 
నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1300 చెల్లిస్తే 100జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.210 లేదా ఏడాదికి రూ.2100 చెల్లిస్తే 200జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.650 లేదా ఏడాదికి రూ.6500 చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇలా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అదనంగా స్టోరేజీ లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు