హువావే నుంచి వై7 ప్రో 2019.. ఫీచర్స్ ఇవే..

సోమవారం, 31 డిశెంబరు 2018 (17:50 IST)
''హువావే వై7 ప్రో 2019'' పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనా మొబైల్ దిగ్గజం హువావే విడుదల చేసింది. భారీ బ్యాటరీ, డుయెల్ కెమెరాలతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో వున్నాయి. 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో పాటు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో ఇది పనిచేస్తుంది. అరోరా బ్లూ, బ్లాక్ అనే రెండు రంగులలో లభించే ఈ ఫోన్ మన దేశంలో సుమారుగా రూ.11,900 ధరకి లభ్యం కానుంది. 
 
అలాగే 6.26 ఫుల్ హెచ్డీ ప్ల‌స్ డిస్ప్లే (1520 × 720 రిజల్యూష‌న్‌), ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌‌ను ఇది కలిగివుంటుంది. హువావే వై7 ప్రో 2019.. సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ వుండదు. బేసిక్ ఫేసియల్ అన్ లాక్‌, వాటర్ డ్రాప్ నోచ్‌ను ఇది కలిగివుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు