ఎవరీ పరాగ్ అనురాగ్‌? మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

మంగళవారం, 30 నవంబరు 2021 (09:41 IST)
ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అనురాగ్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగూల్, అడోబ్, ఐబీఎంస, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థల్లో కామన్ ఏంటని ప్రశ్నించారు. ఈ అంతర్జాతీయ కంపెనీలన్నింటికీ భారత్‌లో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్యవహరిస్తున్నారంటూ గుర్తు చేశారు. 
 
ఎవరీ పరాగ్ అగర్వాల్? 
బాంబే ఐఐటీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వ విద్యార్థి. పదేళ్ళ క్రితం ట్విట్టర్‌లో యాడ్స్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా పదోన్నతి సాధించారు. ఇపుడు సీఈవోగా ఎన్నికయ్యారు. 
 
గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ట్విట్టర్ సీఈవోగా నియమితులైన తర్వాత పరాగ్ అనురాగ్ స్పందిస్తూ, "ఈ బాధ్యతనాకు రావడం పట్ల గర్వపడుతున్నాు. డోర్సే మార్గదర్శత్వాన్ని కూడా కొనసాగిస్తాను. ఆయన స్నేహానికి కృతజ్ఞతలు" అంటూ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు