వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈరోజు నుంచే వాట్సాప్ ఈ ఫీచర్ అప్‌డేట్‌ని కొందరు వినియోగదారులకు విడుదల చేయనుంది. రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ సౌకర్యం లభించనుంది. వాట్సాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఈ ఫీచర్ ఉందో లేదో మీరే స్వయంగా తెలుసుకొనవచ్చు.
వాట్సాప్ ఈ కొత్త వెర్షన్‌లో గ్రూపుల కోసం ప్రైవసీ విభాగాన్ని జోడించింది. సెట్టింగ్స్ మెనూలో అకౌంట్-ప్రైవసీ-గ్రూప్స్ ఎంపికకు వెళ్లి దీనిని చూడవచ్చు. గ్రూపుల కింద వినియోగదారులు నోబడీ, మై కాంటాక్ట్స్, ఎవ్రీవన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. మై కాంటాక్ట్స్ ఎంపికను ఎంచుకుంటే వినియోగదారుల కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు మాత్రమే వాట్సాప్ గ్రూపులో వినియోగదారుని జోడించగలరు.