పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ వ్యవహారంపై మోడీ సర్కార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు… ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసులపై కేవలం పది రోజుల్లోనే వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు… కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
పెగాసస్‌పై దాఖలు చేసిన పిటిషన్లను రెండో రోజు సుప్రీం కోర్టు విచారణ చేసింది. అయితే.. ప్రతి దేశం పెగాసస్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను కొను గోలు చేసిందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కు సమాధానం ఇచ్చింది. అని దేశాల ప్రకారమే తాము కూడా పెగాసస్ నుంచి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశామని తెలిపింది. అయితే..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పై సుప్రీం కోర్టు సీరియస్ అయి… నోటీసులు జారీ చేసింది.