ఈ స్మార్ట్ ఫోన్ ముందు, వెనక సింగిల్ కెమెరా సెన్సార్ ఉంది. అంతేకాకుండా డెడికేటేడ్ మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ తో అందుబాటులోకి వచ్చింది. వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఐరన్ గ్రే, లేక్ బ్లూ రంగుల్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.
రియల్ మీ సీ20ఏ స్పెసిఫికేషన్లు
రెండు సిమ్(నానో) ఆప్షన్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 వర్షన్ ను పొందుపరిచారు. అంతేకాకుండా రియల్ మీ యూఐతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 20:9 డిస్ ప్లే కాన్ఫిగరేషన్ ను కలిగి ఉండి 6.5 అంగుళాల(720X1600 పిక్సెల్) HD స్క్రీన్ తో అందుబాటులోకి వచ్చింది.
అంతేకాకుండా ఆక్టాకోర్ మీడియా టెక్ హెలీయో జీ 35 SoCతో పాటు 2జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం 8 మెగా పిక్సెల్ రియర్ కెమేరాతో ఎఫ్/2.0 లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ తో పాటు ఎఫ్/2.2 లెన్స్ ఫ్లాష్ ను పొందుపరిచారు.