ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. దీన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. ముందువైపు 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
అందువల్ల వీడియోలు, గేమ్స్ స్మూత్‌గా వస్తాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌కు చెందిన హీలియో జి90టి ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని సైతం ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ హీట్‌కు గురి కాకుండా ఉంటుంది.
ఇన్ఫినిక్స్ జీరో 8ఐ స్పెసిఫికేషన్స్…
* 6.85 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2460 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 48, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్
* 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.