భారతదేశంలో గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ కోసం ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించిన సామ్‌సంగ్

ఐవీఆర్

బుధవారం, 14 మే 2025 (19:05 IST)
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఈరోజు తమ విభాగాన్ని నిర్వచించే గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్, సన్నని గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించింది. శైలి, బలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్, స్థిరమైన టైటానియం బాడీలో ప్రీమియం, ప్రో-లెవల్ పనితీరు యొక్క కొత్త సమతుల్యతను తాకుతుంది. గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఎస్ సిరీస్ వారసత్వాన్ని అందిస్తుంది, ఐకానిక్ గెలాక్సీ ఏఐ ఆధారిత కెమెరాను ఏకీకృతం చేస్తుంది, సౌకర్యవంతంగా పోర్టబుల్ పరికరంలో సృజనాత్మకత యొక్క కొత్త రంగాన్ని ఆవిష్కరిస్తుంది.
 
అసాధారణమైన రీతిలో సొగసైన, బలమైన డిజైన్
సన్నని 5.8ఎంఎం చాసిస్‌తో, స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లోని దాదాపు ప్రతి అంశాన్ని పునరావిష్కరించే ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన ప్రదర్శన, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్. దీని మెరుగైన ఫ్రేమ్ బ్రిడ్జెస్ కేవలం 163 గ్రాముల వద్ద రూపుదిద్దుకోవటంతో పాటుగా పనిచేస్తాయి, గెలాక్సీ ఎస్ సిరీస్ యొక్క ఏకీకృత డిజైన్‌కు అనుగుణంగా ఉంటూనే సన్నటి స్మార్ట్‌ఫోన్‌లను తదుపరి స్థాయికి తీసుకువెళతాయి. దాని స్ట్రీమ్‌లైన్డ్ సిల్హౌట్‌, అసాధారణమైన స్థిరత్వం వస్తుంది. మెరుగ్గా వంగిన అంచులు, దృఢమైన టైటానియం ఫ్రేమ్ రోజువారీ ఉపయోగం కోసం శాశ్వత రక్షణను అందిస్తాయి. ఇంజనీరింగ్ స్థిరత్వంను అందించే కొత్త గ్లాస్ సిరామిక్ ఆఫరింగ్  అయిన తాజా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌లో ముందు డిస్‌ప్లే కోసం ఉపయోగించబడుతుంది.
 
పాకెట్ చేయగల 200ఎంపి  కెమెరాతో శక్తివంతమైన సృజనాత్మకత
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ యొక్క సన్నటి, తేలికపాటి డిజైన్ వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా చిరస్మరణీయ క్షణాలను ఒడిసిపట్టటానికి, తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది. 200ఎంపి వైడ్ లెన్స్ గెలాక్సీ ఎస్ సిరీస్ యొక్క ఐకానిక్ కెమెరా అనుభవాన్ని మెరుగు పరుస్తుంది, నైటోగ్రఫీని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. దాని అల్ట్రా-హై రిజల్యూషన్‌ దీనికి తోడ్పడుతుంది, వినియోగదారులు పెద్ద పిక్సెల్ పరిమాణంతో స్పష్టమైన షాట్‌లను తీయగలుగుతూనే చక్కటి  ఫోటోలను పొందుతారు. తక్కువ-కాంతి వాతావరణంలో 40% కంటే ఎక్కువ మెరుగైన ప్రకాశంతో చిత్రాలను ఇది సంగ్రహిస్తుంది. 12ఎంపి అల్ట్రా-వైడ్ సెన్సార్ ఆటోఫోకస్‌ను కలిగి ఉంది, ఇది మరింత సృజనాత్మక సౌలభ్యం కోసం స్ఫుటమైన, వివరణాత్మక మాక్రో ఫోటోగ్రఫీకి శక్తినిస్తుంది.
 
గెలాక్సీ ఏఐతో విశ్వసనీయ సహచరుడు
దాదాపు ప్రతి టచ్‌పాయింట్‌లో గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ మా అత్యంత సహజమైన మరియు సందర్భోచిత మొబైల్ ఏఐ అనుభవాలను అందిస్తుంది. వినియోగదారులు తమ వ్యక్తిగత డేటా ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుందని మనశ్శాంతితో వ్యక్తిగతీకరించిన, మల్టీమోడల్ ఏఐ సామర్థ్యాలను పొందుతారు.
 
విస్తృత గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను ప్రతిబింబిస్తూ, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ బహుళ యాప్‌లలో సజావుగా పనిచేసే ఏఐ ఏజెంట్‌లను ఏకీకృతం చేస్తుంది, పనులను మరింత సులభంగా పూర్తి చేయడానికి నిజమైన ఏఐ సహచరుడిగా సహాయపడుతుంది. గెలాక్సీ ఏఐ రోజువారీ దినచర్యలతో అనుసంధానించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. నౌ బ్రీఫ్ మరియు నౌ బార్లో ఎక్కువ సౌలభ్యం కోసం, రోజువారీ ప్రయాణం, భోజనం మరియు మరిన్నింటి సమయంలో సహాయకరమైన రిమైండర్‌ల కోసం మూడవ పక్ష యాప్ ఇంటిగ్రేషన్‌లు ఉన్నాయి.
 
గూగుల్‌తో గెలాక్సీ యొక్క లోతైన అనుసంధానం కారణంగా, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ జెమిని యొక్క తాజా పురోగతులను మరింత మంది వినియోగదారులకు తీసుకువస్తుంది. ఉదాహరణకు, జెమిని లైవ్ యొక్క కొత్త కెమెరా, స్క్రీన్ షేరింగ్ సామర్థ్యాలతో, వినియోగదారులు తమ స్క్రీన్‌పై లేదా తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో చూసే వాటిని జెమిని లైవ్‌కు చూపించవచ్చు, అదే సమయంలో లైవ్ సంభాషణలో దానితో సంభాషించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు