వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు.. ఇకపై వాట్సాప్ ద్వారా మినీ స్టేట్మెంట్లు
గురువారం, 21 జులై 2022 (17:35 IST)
whatsapp
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వాట్సాప్ ద్వారా ఇక బ్యాంక్ సేవలు అందనున్నాయి. ఇకపై ఖాతాదారులు బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్‌మెంట్‌లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు అందుబాటులోకి కొత్త సేవలు తీసుకొచ్చాయి.
దీంతో ఎస్బీఐ కస్టమర్లు రుణదాత నుండి కొన్ని బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి WhatsAppను ఉపయోగించవచ్చు, ఇది యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా ATMని సందర్శించాల్సిన అవసరం వుండదు.
SBI WhatsApp బ్యాంకింగ్ ద్వారా ఈ సేవను ఉపయోగించడానికి మీరు ముందుగా నమోదు చేసుకోవాలి. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి 7208933148 నంబరుకు మెసేజ్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత వాట్సాప్‌లో నుంచి +91 9022690226కి Hi అని వాట్సాప్ మేసెజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.
ఇలా చేయగానే చాట్ బాక్స్‌లో అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, వాట్సాస్ బ్యాంకింగ్ సేవలు రద్దు అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకొని సదరు నెంబర్‌ను టైప్ చేసి ఎంటర్ చేయాలి.