టిక్ టాక్‌‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్..?

గురువారం, 13 ఆగస్టు 2020 (10:56 IST)
కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైనా కారణంగా టిక్‌టాక్‌పై నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్) టిక్‌టాక్‌ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్ ‌డాన్స్‌తో ప్రారంభ దశ చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 
 
మొత్తం ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్‌కు విక్రయించేందుకు బైట్‌డాన్స్ సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించినట్లు తెలిసింది. రెండు కంపెనీలు జూలైలో చర్చలు ప్రారంభమైనా గానీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని టెక్ క్రంచ్ నివేదించింది. అయితే, ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ నిరాకరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు