అత్యాధునిక డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌తో హైదరాబాద్‌లో ప్రవేశించిన వీయం సాఫ్ట్‌వేర్
సోమవారం, 3 అక్టోబరు 2022 (21:34 IST)
ఆధునిక డేటా పరిరక్షణ పరిష్కారాలను అందించే బ్యాకప్, రికవరీ డాటా మేనేజ్‌మెంట్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ వీయం సాఫ్ట్‌వేర్, తమ అత్యాధునిక డేటా ప్రొటెక్షన్ పరిష్కారాలను అన్ని వాతావరణాలు- క్లౌడ్, వర్ట్యువల్, సాస్, కుబెర్‌నెట్స్, ఫిజికల్‌లో అత్యంత అధునాతన డాటా పరిరక్షణ పరిష్కారాలను హైదరాబాద్ మార్కెట్‌లో పరిచయం చేసింది.
వీయం ఇటీవలనే హోప్ ఆన్ వీయం, యువర్ జర్నీ టు మోడ్రన్ డాటా ప్రొటెక్షన్ (ఆధునిక డాటా రక్షణ దిశగా మీ ప్రయాణం)ను ప్రారంభించింది. భారతదేశంలో సంస్ధకు ఇది మొట్టమొదటి మల్టీ సిటీ రోడ్ షో. దీనిద్వారా వీయం భాగస్వాములు, వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుత డాటా ప్రొటెక్షన్‌కు సంబంధించి విషయ పరిజ్ఞానంతో కూడిన చర్చలను చేయడం వీలవుతుంది. అత్యంత కీలకమైన డాటా పరిరక్షణకు సంబంధించి అత్యుత్తమ ప్రక్రియలను వీయం వాటాదారులకు తెలపడమూ వీలవుతుంది. హోప్ ఆన్ వీయం బస్‌లో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ల్యాబ్ ఉంటుంది. ఇంజినీర్లు ఏడబ్ల్యుఎస్, అజూర్, గుగూల్ క్లౌడ్ కోసం క్లౌడ్ నేటివ్ పరిష్కారాలపై లైవ్ డెమోలు, మైక్రోసాఫ్ట్ 365 కోసం సాస్ ఆఫరింగ్స్, కంటిన్యూస్ డాటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ (సీడీపీ), వీయం డిజాస్టర్ రికవరీ ఆర్కెస్ట్రార్ (వీడీఆర్‌ఓ), వీయం క్లౌడ్ కనెక్ట్ , ఎన్‌ఏఎస్ బ్యాకప్, వీయం బ్యాకప్, రెప్లికేషన్‌వీ 11, వీఎంవేర్ వీస్ఫియర్ కోసం ఇన్‌స్టెంట్ రికవరీ వంటివి ప్రదర్శిస్తారు.
వ్యాపార సంస్ధలు డాటాతో పాటుగా తాము సృష్టించిన డాటాపై ఆధారపడటం గణనీయంగా పెరిగింది. దీనివల్ల ఈ సంస్ధలు మరింతగా సైబర్‌దాడుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వీయం డాటా ప్రొటెక్షన్ ట్రెండ్స్‌నివేదికలు 2022 వెల్లడించే దాని ప్రకారం, గత 12 నెలల కాలంలో 84% భారతీయ సంస్థలు రాన్సమ్‌వేర్ బారిన పడ్డాయి. వరుసగా రెండవ సంవత్సరం ఈ సంస్ధలు ఎక్కువ సమయం ఉత్పత్తి లేకుండా ఉండటానికి సైబర్‌దాడులు ఓ కారణంగా నిలుస్తున్నాయి. ఇది వీయంకు భారతీయ వ్యాపార సంస్థలకు డాటా బ్యాకప్స్ పట్ల అవగాహన కల్పించడం మరియు వ్యాపార కొనసాగింపుకు తగిన భరోసా అందిస్తూ డాటా పరిరక్షణ పరిష్కారాలను అందుబాటులో ఉంచడం పట్ల అవగాహన కల్పించే అవకాశం అందిస్తుంది.
రాన్సమ్‌వేర్ లాంటి సైబర్‌దాడులు తరచుగా జరుగుతుండటంతో పాటుగా మరింత లక్ష్యితంగా జరుగుతున్నాయి. తీవ్రంగా వ్యాపారకార్యకలాపాలలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మీ డాటాపై మీ ఆజమాయిషీ మరింత క్లిష్టంగా మారింది. వీయం యొక్క డాటా ప్రొటెక్షన్, రికవరీ పరిష్కారాలు అమలు చేయడం వల్ల వ్యాపార సంస్ధలు తమ డాటాను సొంతం చేసుకోవడం, నియంత్రించుకోవడం, రక్షించుకోవడం సాధ్యమవుతుంది. అది వారి ప్రాంగణంలో ఉన్నా, క్లౌడ్‌పై ఉన్నా లేదంటే కంటెయినర్స్‌తో నిర్మితమైన ఆధునిక అప్లికేషన్‌లో భాగమై, క్యుబ్‌మీట్స్ నిర్వహిస్తున్నా సాధ్యమవుతుంది అని సందీప్ బాంబురీ, వైస్ ప్రెసిడెంట్, వీయం ఇండియా-సార్క్ అన్నారు.
వీయం ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది మరియు డాటా పర్యావరణ వ్యవస్ధలో ఎపిక్ కేంద్రంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లో మేము ఫార్మాస్యూటికల్స్, తయారీ రంగాలలో మా మార్కెట్ విస్తరణకు గణనీయమైన అవకాశాలున్నాయి. అంతేకాకుండా మా వినియోగదారు గ్రాన్యూల్స్ ఇండియాతో మా భాగస్వామ్యం మరింతగా బలోపేతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ కీలక వర్టికల్స్‌లో మా ప్రయత్నాలను రెట్టింపు చేయాలని మేము కోరుకుంటున్నాము. తద్వారా వ్యాపార సంస్ధలన్నింటికీ ఆధునిక డాటా పరిరక్షణ వ్యూహంతో సహాయపడనున్నాము అని అన్నారు.
రాబోయే నాలుగు వారాలు ఈ హోప్ ఆన్ వీయం బస్సు తొమ్మిది నగరాలు సందర్శించడంతో పాటుగా డాటా భద్రత పరిష్కారాల ఆవశ్యకత పట్ల అవగాహన కల్పిస్తుంది. అలాగే వ్యాపార సంస్ధలు తమంతట తాము డాటాను రికవర్ చేసుకోవడం, బ్యాకప్ తీసుకోవడం, నియంత్రించుకోవడంలో సైతం సహాయపడుతుంది. అది వారు కంపెనీ సర్వర్‌లో ఉన్నా క్లౌడ్‌పై ఉన్నా సరే కాపాడుతుంది. ఈ బస్సు తన ప్రయాణం సెప్టెంబర్ 16న గురుగ్రామ్‌లో ప్రారంభించింది. జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పూనెలలో ఆగింది.ఈ యాత్ర అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ తరువాత ఈ యాత్ర అక్టోబరు 7న చెన్నై, అక్టోబర్ 10న